కలం, వెబ్ డెస్క్ : నేడు (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (AP Inter Exams) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా కానీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని ఇంటర్ బోర్డు(Inter Board) స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించింది.
అయితే ఈసారి 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,31,275 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ఉండగా, 5,26,264 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారు. విద్యార్ధులు నియమాలు పాటిస్తూ.. సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ సూచించింది.


