కలం, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తెలుగు సినిమాలో నటించి చాలా కాలమే అయింది. చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. మళ్ళీ ఛాన్నాళ్ళకి ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
సమంత భర్త రాజ్ నిడమోరు (Raj Nidimoru) కథ అందించగా.. టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాను సమంత తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై గ్రాండ్గా నిర్మిస్తుంది. కల్కి ఫేమ్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది మే 15న ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaaram) గ్రాండ్ రిలీజ్ కానుంది అంటూ మేకర్స్ ప్రకటించారు.


