కలం, డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి (Tirumala Ghee Case) ఇష్యూ మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సిట్ నివేదిక సమర్పించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ లో ప్రతివాదులుగా ఏపీ, కేంద్ర ప్రభుత్వం, సిట్, సిబీఐ, టీటీడీలను చేర్చారు. ఆయన వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు విచారణ ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుపై ఏపీలో ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. దీని మీద ఏపీ గవర్నమెంట్ మాజీ ఐపీఎస్ అధికారితో ఏకసభ్య విచారణ కమిటీ వేసింది. ఆ కమిటీపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ మీద కక్ష సాధింపుల కోసమే సిట్ నివేదికను కాదని ఏకసభ్య కమిటీ వేశారంటూ మండిపడుతున్నారు వైసీపీ లీడర్లు.


