కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్‌కు అసలు సమస్య బ్యాటింగ్ కాదు, క్యాచులేనని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ యాంకర్ పాత్ర పోషించడం పెద్ద సమస్య కాదని ఆయన తెలిపారు. టీమిండియా ఈ టోర్నీలో ఎక్కువగా 170 నుంచి 180 పరుగుల మ్యాచ్‌లు జరుగుతున్నాయని చోప్రా విశ్లేషించారు. అలాంటి మ్యాచ్‌ల్లో అవసరమైతే నెమ్మదిగా ఆడటం తప్పుకాదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఇద్దరు బ్యాటర్లు యాంకర్ పాత్ర పోషించడం జట్టుకు నష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
ఈ టోర్నీలో తిలక్ వర్మ (Tilak Varma) నాలుగు ఇన్నింగ్స్‌లలో 106 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 120.45గా ఉంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నాలుగు ఇన్నింగ్స్‌లలో 162 పరుగులు చేసి 136.13 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అయితే ఫీల్డింగ్ మాత్రం భారత్‌కు పెద్ద సమస్యగా మారిందని చోప్రా హెచ్చరించారు. జట్టు ఎక్కువ క్యాచులు వదిలేసిందని గుర్తుచేశారు. క్యాచులు పట్టలేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. క్యాచులు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవని ఆయన (Aakash Chopra) అభిప్రాయపడ్డారు.
Read Also: అక్షర్ పటేల్ vs కేశవ్ మహారాజ్.. ఎవరి సత్తా ఎంత?
Follow Us On: Instagram


