epaper
Sunday, February 22, 2026
epaper

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తమన్, రాకింగ్​ రాకేశ్​

కలం, వరంగల్ బ్యూరో: టాలీవుడ్​ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్​ఎస్​ తమన్ ​(SS Thaman) తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం వరంగల్​ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధర్మకర్తలతోపాటు, ప్రధాన అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను తమన్​ తిలకించారు. అర్చకులు ఆయన​ కుటుంబానికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు అందించారు. ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్​, మోత్కూరి మయూరి రామేశ్వరరావు, అనంతుల శ్రీనివాస్​, ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం అమ్మవారిని జబర్దస్త్​ రాకింగ్​ రాకేశ్​ కూడా తన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Read Also: నిన్న స్టూడెంట్​.. నేడు స్పీకర్​ : కెన్నెడీ స్కూల్​ నుంచి సీఎంకు ఆహ్వానం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>