కలం, మెదక్ బ్యూరో : భార్య గొంతు కోసి దారుణంగా చంపేశాడో భర్త. ఈ దారుణమైన ఘటన చేగుంట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ (Medak) జిల్లా చేగుంట వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న వరలక్ష్మి, ఆమె భర్త త్రిమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో వరలక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


