కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth) వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా దేవాదుల ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఇంటెక్ వెల్ తో పాటు గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ప్రస్తుతం ఎత్తిపోస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలోగా ఇంటెక్ వెల్ పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ సందర్భంగా పెండింగ్ పనులపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


