epaper
Sunday, February 22, 2026
epaper

జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

కలం/ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్లకు సంబంధించి చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ఇబ్బందికరంగా మారాయని జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy)  శుభవార్త చెప్పారు. అక్రిడేషన్ల గడువు మరో నెల రోజులు పొడిగిస్తామని తెలియజేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ బృందం నాయకులు జర్నలిస్టుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ ఈ సందర్భంగా మంత్రికి అన్ని విభాగాల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

50 శాతం మంది జర్నలిస్టులకు కూడా కార్డులు రావేమో..

రాష్ట్రంలో 44,709 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పారని, జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూడా రావనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నారు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డులు ఇచ్చేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. వైబ్ సైట్ ఫార్మాట్ సులభతరంగా లేదని ప్రస్తావించారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గత సాంప్రదాయం ప్రకారం రిజిస్టర్డ్ యూనియన్ నుంచి లెటర్ పంపితే కమిషనర్ కార్యాలయం ఆమోదించి వారిని కమిటీ లో సభ్యులుగా తీసుకునేవారని, ప్రస్తుతం దానిని పక్కన పెట్టి కలెక్టర్లకు అధికారం కల్పించడాన్ని తప్పు పట్టారు. ఇది అత్యంత విచారకరమన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్లకు అధికారాలతో చిక్కులు

ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరిని నామినేట్ చేస్తారనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్ కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుందని Ponguleti Srinivasa Reddy  పేర్కొన్నారు. గతంలో అక్రిడిటేషన్ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని రామ్ నారాయణ మంత్రిని కోరారు. జీవో ప్రకారం పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్, డెస్క్ జర్నలిస్టుల కార్డులు తగ్గించడం జరిగిందని, దీంతో ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు.

చిన్న పత్రికల వారు కూడా తమకు గతంలో మాదిరిగా కార్డులు రావని ఆందోళనలో ఉన్నారని, కేబుల్ చానల్స్ జర్నలిస్టులకు కూడా అన్యాయమే జరుగుతుందని వివరించారు. గతంలో వారు కార్డులు పొందినప్పటికీ , ఈసారి కార్డులు రావని ఆందోళన చెందుతున్నారని 20 నిమిషాల పాటు అన్ని అంశాలపై మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ వెబ్ సైట్ ను సరళీరిస్తామన్నారు. అక్రిడిటేషన్ గడువు మరో నెల పొడిగిస్తామని.. జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కాగా ఈ నెల 28వ తేదీన అక్రిడేషన్ల గడువు ముగుస్తుండడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>