కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) మరణం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన కూసుమంచి పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. నార్కట్ పల్లి – నకిరేకల్ మధ్య శ్రీనివాస్ ను నిందితులు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హత్య అనంతరం మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్ లో పడేసిన నిందితులు, ఈ ఘటనను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో శ్రీనివాస్ (Boggula Srinivas) పవన్ కళ్యాణ్ పై రాసిన పుస్తకానికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం డబ్బుకు సంబంధించిన వివాదాలే ఈ దారుణానికి దారి తీశాయని వివరించారు.
Read Also: కరీంనగర్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన కొలగాని శ్రీనివాస్
Follow Us On : WhatsApp


