కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి (Yadadri) జిల్లాలో వాట్సాప్ గ్రూప్ వార్ మొదలయింది. వాట్సాప్ గ్రూప్లో రిమూవ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP) కార్యకర్తల మధ్య ఘర్షణ చిలికి చిలికి తుఫానులా మారింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో లింగోజీగూడెం(Lingojigudem) మూడో వార్డులో బిజెపి అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.
అయితే ఆ వార్డు వాట్సాప్ గ్రూప్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు రిమూవ్ చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వాట్సాప్ గ్రూప్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత బోసు బాబుపై బీజేపీ కార్యకర్తలు బీరు సీసాతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బోసు బాబును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


