epaper
Sunday, February 22, 2026
epaper

రాజకీయ నేతలు అసహ్యంగా మాట్లాడుతున్నారు : వెంకయ్య నాయుడు

కలం, డెస్క్ : రాజకీయ నేతలు సోషల్ మీడియా మాయలో పడి అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) విమర్శించారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన తెలుగు మహా కవిసమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు  (Venkaiah Naidu) మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో గౌరవ, మర్యాదలు కనిపించకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో, టీవీ చర్చల్లో, బహిరంగ సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని వెంకయ్య చెప్పారు. బూతులు మాట్లాడే నాయకులకు బూత్ లోనే సమాధానాలు చెప్పాలని సూచించారు. బూతులు మాట్లాడిన వారెరవ్వరూ మొన్నటి ఎన్నకల్లో గెలవలేదని చెప్పారు వెంకయ్య.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>