epaper
Sunday, February 22, 2026
epaper

సీఎం కప్ ఆర్చరీ‌లో నిజామాబాద్ బాలికకు మెడల్

కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో నిజామాబాద్‌కు చెందిన శ్రీనిక (Sreenika) సత్తా చాటింది. ఖమ్మంలో జరుగుతున్న సీఎం రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మద్దుల శ్రీనిక (Sreenika) బ్రోంజ్ మెడల్ సాధించింది. రెండు రోజులుగా రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఖమ్మంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా తరఫున పదో తరగతి విద్యార్థిని శ్రీనిక పాల్గొని సత్తా చాటింది. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనిక కలెక్టర్ అణుదీప్ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై  ఖమ్మంలో జరిగిన సీఎం కప్ ఆర్చరీలో పాల్గొని రాణించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. శ్రీనిక తల్లిదండ్రులు, గ్రామస్తులు, జిల్లా వాసులు అభినందనలు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>