కలం, డెస్క్: తన యూజర్స్ కోసం ఫోన్‌పే (Phonepe) మరో అద్భుతమైన కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.ఈ ఫీచర్‌తో యూపీఐ చెల్లింపులు ఇంకా చాలా సులభం కానున్నాయి. వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్లతోనే పేమెంట్లు చేసే కొత్త ఏఐ ఫీచర్‌ను ఫోన్‌పే రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ ఫండ్రీ (Microsoft Foundry) సహాయంతో ఈ కొత్త ఫీచర్‌ను రూపొందించింది ఫోన్‌పే. వినియోగదారులు సహజమైన భాషలో టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా పేమెంట్లు చేయడం, రీచార్జ్‌లు చేయడం వంటి పనులు చేయవచ్చు. దీంతో యాప్ వినియోగం మరింత సులభంగా మారనుంది.
ఈ ఫీచర్ ద్వారా “సతీష్‌కు 20 రూపాయలు పంపు” వంటి కమాండ్ ఇస్తే, సంబంధిత కాంటాక్ట్ ఆటోమేటిక్‌గా ఎంపికై పేమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఫాస్టాగ్ రీచార్జ్ లేదా గోల్డ్ ధర వంటి వివరాలు కూడా వాయిస్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే కాంటాక్ట్స్‌కు చెల్లింపులు చేయాలంటే మనం సేవ్ చేసుకున్న పేరునే చెప్పాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపులకు భద్రతను పెంచేందుకు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ ద్వారా ధృవీకరణ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది యూపీఐ పిన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ అదనపు భద్రతను అందిస్తుంది.
ఈ ఫీచర్ యూజర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పేమెంట్ చేయాలా, కొనుగోలు పూర్తి చేయాలా లేదా సహాయం కావాలా అనే విషయాన్ని గుర్తించగలదని కంపెనీ తెలిపింది. అన్ని ప్రక్రియలు భద్రతతో జరుగుతాయని, వ్యక్తిగత సమాచారం యాప్ (Phonepe) బయటకు వెళ్లదని స్పష్టం చేసింది. ఈ ఫీచర్‌ను యాప్‌లోని గ్లోబల్ సెర్చ్ బార్, హెల్ప్ సెంటర్, హిస్టరీ ట్యాబ్ ద్వారా వినియోగించవచ్చు. ప్రస్తుతం అన్ని నగరాల్లో అందుబాటులో లేకపోయినా, దశలవారీగా అందరికీ చేరనుంది.
ఈ ఫీచర్ ద్వారా చెల్లింపులను మరింత సులభంగా మార్చే దిశగా మొదటి అడుగు పడిందని కంపెనీ ప్రతినిధి రాహుల్ చారీ అన్నారు. ఏఐ సహాయంతో వినియోగదారుల అవసరాలను ముందుగానే అర్థం చేసుకునే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సహజ భాష వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్ డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందని మరో ప్రతినిధి పుణీత్ చందోక్ పేర్కొన్నారు.
Read Also: ప్లాస్టిక్ డ్రమ్‌తో గిటార్ మ్యూజిక్.. ఇండోనేషియా యువకుడు అదుర్స్
Follow Us On: Instagram


