epaper
Sunday, February 22, 2026
epaper

భారత్‌పై ఉన్న ఒత్తిడి మాకు అడ్వాంటేజ్: కాన్రాడ్

కలం, స్పోర్ట్స్: సూపర్-8లో (Super 8) భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ (South Africa Coach Shukri Conrad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ఉన్న ఒత్తిడిని తమకు అవకాశంగా మార్చుకోవచ్చని అన్నాడు. ఈ మ్యాచ్ టోర్నీలో ఇప్పటివరకు అత్యంత కీలక పోరని అభిప్రాయపడ్డాడు. గ్రూప్ దశలో మంచి ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్ దక్షిణాఫ్రికా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాను ఎదుర్కోవడానికి సిద్ధమయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫిబ్రవరి 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగానే కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలు, ప్రేక్షకుల ఒత్తిడి భారత్‌పై ప్రభావం చూపవచ్చని కాన్రాడ్ భావించాడు. పెద్ద జట్టుతో ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందని అందరూ మాట్లాడుతారని, కానీ ఆ జట్టుపై ఉండే ఒత్తిడి గురించి తక్కువగా మాట్లాడతారని అన్నాడు.

మ్యాచ్-అప్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయంతో కాన్రాడ్ (South Africa Coach) ఏకీభవించలేదు. మంచి బ్యాటింగ్ పిచ్‌లపై మ్యాచ్-అప్స్ ప్రభావం తగ్గిపోతుందని అన్నాడు. పిచ్‌లో స్పిన్‌కు సహాయం ఉంటే మాత్రమే కొన్ని మ్యాచ్-అప్స్ ఉపయోగపడతాయని చెప్పారు. ఈ మ్యాచ్ విజయం సెమీఫైనల్ అవకాశాలను పెంచే అవకాశం ఉండటంతో రెండు జట్లకు ఇది కీలకంగా మారింది. సూపర్-8 దశలో ఈ పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Read Also: దేశం పరువు తీస్తారా! : కాంగ్రెస్​ తీరుపై జగన్​ ఫైర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>