కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఉగ్రవాదులు మరోసారి పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్ర యంత్రాంగం అప్రమత్తమైంది. చారిత్రక కట్టడం ఎర్రకోటతో (Red Fort) పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఐఈడీ పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. గత ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని ఈ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
ఈ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఎర్రకోట (Red Fort), చాందినీ చౌక్ (Chandni Chowk) పరిసరాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దృష్ట్యా పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాత ఢిల్లీ ప్రాంతమంతా పోలీసుల పహారాలో ఉంది.
Read Also: సుప్రీం తీర్పుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: న్యాయమూర్తులపై అసహనం
Follow Us On: Sharechat


