కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని కొండాపూర్ (Kondapur) ప్రాంతంలో భూ ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ చర్యలో సుమారు రూ.700 కోట్ల విలువ గల భూమిని కబ్జా నుండి కాపాడినట్లు తెలిపారు. రాజరాజేశ్వరి కాలనీలోని 7 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు, బారికేడ్లు ఇతర ఆక్రమణలను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆక్రమణలను తొలగించే సమయంలో భద్రత కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికులు, ఆక్రమణకారులు మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.


