కలం, వెబ్ డెస్క్ : నేడు(శనివారం) పల్నాడు జిల్లా వినుకొండ (Vinukonda)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. పల్నాడు (Palnadu) జిల్లాలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ఎన్ఎస్సీ మైదానంలో నిర్వహించే “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర”(Swarna Andhra – Swachh Andhra) కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యాలతో చేపట్టిన కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3.05 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సీఎం సమావేశం అయ్యి పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రం 4.35 గంటలకు వినుకొండ (Vinukonda) ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని పరిశీలించనున్నారు. అలాగే ఆసుపత్రి సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.


