epaper
Sunday, February 22, 2026
epaper

ట్రంప్ నకు బిగ్ షాక్.. టారిఫ్‌లను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు

కలం, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచ దేశాల మీద ట్రంప్ వేసిన టారిఫ్‌ లను (US Tariffs) తాజాగా అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ట్రంప్ వివిధ దేశాల నుంచి సుంకాల రూపంలో వసూలు చేసిన మొత్తం తిరిగి చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పింది. అమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లకు వ్యతిరేకంగా ఆరుగురు న్యాయమూర్తులు, అనుకూలంగా ముగ్గురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. దీంతో టారిఫ్ లను కొట్టేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి వచ్చేశాయి. మన ఇండియా మీద ప్రస్తుతం 18 శాతం టారిఫ్‌ లు వేశాడు ట్రంప్. ఇంతకు ముందు మన దేశం మీద 50 శాతం దాకా టారిఫ్ లు విధించిన ట్రంప్.. ట్రేడ్ డీల్ కుదుర్చుకుని వ్యూహాత్మకంగా 18 శాతానికి తగ్గించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>