కలం, డెస్క్ : ఎల్బీనగర్ లోని ప్రముఖ చట్నీస్ (Chutneys) హోటల్ లో పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫుల్ రష్ ఉన్న టైమ్ లో ఇడ్లీ స్టిమర్ సడెన్ గా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి కస్టమర్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మేనేజ్ మెంట్ ఈ విషయం బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.


