తేల్చుకుందాం రా.. అక్బరుద్దీన్‌కు రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: అక్బరుద్దీన్ ఒవైసీ పాత వ్యాఖ్యలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) విరుచుకుపడ్డారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్బరుద్దీన్‌‌ (Akbaruddin Owaisi)ను టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘15 నిమిషాలు కాదు.. 15 ఏళ్లు టైం ఇచ్చినా ఒవైసీ బ్రదర్స్ సోదరులు ఏమీ చేయలేరు’’ అంటూ సవాల్ విసిరారు. కేవలం మాటలతో కాకుండా, చేతల్లో చూపించుకుందాం అంటూ రాజాసింగ్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ముందుకు రావాలని, అప్పుడే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని ఆయన ఘాటుగా విమర్శించారు.

‘‘నువ్వు డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీ సెక్యూరిటీని వదిలేయ్, నేను కూడా నా సెక్యూరిటీని వదిలేసి వస్తా. ఎలాంటి ఆయుధాలు కూడా లేకుండా ఒంటరిగా వస్తా. అప్పుడు చూసుకుందాం ఎవరి బలం ఎంతో” అని సవాల్ చేశారు. ఒవైసీ బ్రదర్స్ కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలకే పరిమితం కాకుండా, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>