కలం, వెబ్ డెస్క్ : భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కోర్టులో ఏసీబీ (ACB) అధికారులు తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో రూ.5,000 లంచం తీసుకుంటూ కోర్టు సిబ్బంది పట్టుబడ్డారు. ఈ ఘటనలో స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అదుపులోకి తీసుకున్నారు. ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ (ACB) అధికారులు నేరుగా తనిఖీలు జరిపి, లంచం తీసుకుంటున్న సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ (Red Handed) గా పట్టుకున్నారు.


