కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), క్యూట్ బ్యూటీ మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన క్యూట్ లవ్ స్టోరీ ” కపుల్ ఫ్రెండ్లీ “(Couple Friendly) మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డార్లింగ్ ప్రభాస్ (Prabhas) తో మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇంటర్వ్యూలో భాగంగా చిత్ర విశేషాలు తెలుసుకున్న ప్రభాస్.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ మానస విజయవాడ పుణుగులు తిన్నారా అంటూ ప్రభాస్‌ని ఫన్నీ ప్రశ్న అడగగా.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. నాకు పుణుగులంటే చాలా ఇష్టం. విజయవాడ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడల్లా పుణుగులు తినాలనిపించేది. కానీ ఎక్కువ నైట్ షూటింగ్స్ వల్ల కుదిరేది కాదు. పునుగులు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నోరూరుతుంది. ”పునుగులు ఈజ్ యాన్ ఎమోషన్” అంటూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు.


