epaper
Monday, February 23, 2026
epaper

ఇన్‌స్టా అకౌంట్ డిలీట్: అన్వేష్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ వ్యవహారంపై యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) (Anvesh) ఘాటుగా స్పందించారు. అసలు ఆ అకౌంట్ పోతే నాకేంటి అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

నా ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఏంటి.. పోతే ఏంటి అంటూ అన్వేష్ ప్రశ్నించారు. తను ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్లు చేయలేదని, ఎవరికీ లింకులు ఇవ్వలేదని, ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. తనకు ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా పెద్దగా నష్టం లేదని, తనకు యూట్యూబ్ మాత్రమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గత నెల యూట్యూబ్​ నుంచి రూ.8 లక్షలు వచ్చాయని తెలిపారు.

తన సోషల్ మీడియా నెట్‌వర్క్ గురించి వివరిస్తూ ఆసక్తికరమైన పోలికలు చేశారు. తన రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు రెండు చేతులు లాంటివని, రెండు యూట్యూబ్ ఛానల్స్ రెండు కాళ్లని, ఫేస్‌బుక్ తన శరీరం లాంటిదని పేర్కొన్నారు. వీటన్నింటినీ నడిపించేది తన తెలివైన బుర్ర అని, అది ఉండబట్టే చాలా మందికి నిద్ర లేకుండా చేస్తున్నానని అన్నారు.

అంతేకాకుండా, నేను దొరికితే నేరుగా వచ్చి తన తల నరికేయాలని అన్నారు. ముఖ్యంగా తనను విమర్శించే వారిని, వ్యతిరేకించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్పారు. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తానని, తాను ఎవరినీ లెక్కచేయనని అన్వేష్​ (Anvesh) హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>