epaper
Sunday, February 22, 2026
epaper

అక్కడ కాల్పులు.. ఇక్కడ తనిఖీలు

కలం, ఖమ్మం బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర బలగాల ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. అడుగడుగునా తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సరిహద్దులను దాటడానికి అనుమతి ఇస్తున్నారు. ఒకవైపు మావోయిస్టుల కోసం ఆపరేషన్ (Operation) నిర్వహిస్తూనే.. మరోవైపు జన జీవనస్రవంతిలో కలిసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ముందు తాటి మూక అలియాస్ చూటీ అనే మావోయిస్టు లొంగిపోయాడు. మొత్తంగా ఏడాది కాలంలోనే 359 మంది మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>