epaper
Sunday, February 22, 2026
epaper

లోక్​సభ ఎంపీ హఠాన్మరణం

కలం, వెబ్​ డెస్క్​: లోక్​సభ ఎంపీ రికీ ఏజే సింగ్​కాన్(54)​ హఠాన్మరణం చెందారు(Ricky AJ Syngkon). మేఘాలయ రాజధాని షిల్లాంగ్​లో గురువారం సాయంత్రం కలసి ఫుట్​బాల్​ ఆడుతుండగా కార్డియాక్ అరెస్ట్​తో కుప్పకూలారు. వెంటనే ఆయన్ని స్నేహితులు సమీపంలోని మవలై మవియోంగ్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జైయావ్​లోని గోర్డాన్​ రాబర్ట్స్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

మేఘాలయలోని షిల్లాంగ్​ నుంచి రికీ ఆండ్రూ జె సింగ్​కాన్​ (Ricky AJ Syngkon) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయన వాయిస్​ ఆఫ్​ ది పీపుల్​ పార్టీ(వీపీపీ) నుంచి ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికైన కాంగ్రెస్ సిట్టింగ్​ ఎంపీ విన్సెంట్​ హెచ్​ పాలాను 3లక్షల 70 వేల ఓట్ల భారీ తేడాతో సింగ్​కాన్ ఓడించారు.

సింగ్​కాన్​ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా, ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్​ తియాన్​సాంగ్​ తదితరులు సంతాపం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>