కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth) తనపై 2023లో నమోదైన రెండు కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. 2023లో ఎన్నికల సందర్భంగా తనపై రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ అప్పటి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ (Revanth) మీద అప్పుడే 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి.. కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి గండ్ర వెంకటరమణారెడ్డి తరఫు లాయర్ టైమ్ కావాలని కోరడంతో.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.


