కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్ మహిళల జట్టుకు కీలకంగా నిలిచిన లారెన్ డౌన్ (Lauren Down) తన కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఎన్‌జెడ్సీ అధికారికంగా ప్రకటించింది. 2018లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డౌన్, ఆరు ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికారు. వైట్ ఫెర్న్స్ తరఫున 48 వైట్‌బాల్ మ్యాచ్‌లు ఆడి 500కు పైగా పరుగులు సాధించారు. చివరిసారిగా 2024లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ ఆడారు.
2023లో తొలి సంతానం కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న ఆమె, తరువాతి సీజన్‌లో తిరిగి జట్టులో చేరారు. కుటుంబ బాధ్యతలతో పాటు కెరీర్‌ను సమతుల్యం చేసుకున్నారు. రిటైర్మెంట్‌పై స్పందించిన డౌన్, దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జట్టు సహచరులను మిస్ అవుతానని, ఇకపై బయట నుంచి జట్టును ప్రోత్సహిస్తానని తెలిపారు. ఆక్లాండ్ క్రికెట్, కోచ్‌లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
హెడ్ కోచ్ బెన్ సాయర్ (Ben Sawyer) ఆమె సేవలను ప్రశంసించారు. జట్టుకు అంకితభావంతో పనిచేసిందని, తల్లి అయిన తర్వాత కూడా త్వరగా తిరిగి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఆమె (Lauren Down) కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. జట్టులోపల, బయట విలువలను పాటించిందని, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. లారెన్ డౌన్ రిటైర్మెంట్‌తో వైట్ ఫెర్న్స్‌లో ఒక అధ్యాయం ముగిసింది.
Read Also: ఇటలీపై కరేబియన్స్ ఘన విజయం
Follow Us On: Sharechat


