కలం, డెస్క్ : తెలంగాణలో అధికారుల లంచాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇంతకు ముందు క్యాష్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్ల బాట పట్టారు. తాజాగా విద్యుత్ డిపార్టుమెంట్ లో 8 మంది అధికారులు (Officials Suspended) ఫోన్ పేలో లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయారు. టీజీఎస్పీడీసీఎల్ లో ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజినీర్లు మొత్తం 8 మంది రకరకాల పనుల్లో ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలింది.
యాంటీ బ్రైబరీ సెల్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేసింది. ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నట్టు ఆధారాలు దొరకడంతో ఆ 8 మందిని సస్పెండ్ (Officials Suspended) చేసింది ప్రభుత్వం. అయితే దీనిపై సదరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంది. రీసెంట్ గా తాము ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడంతోనే ఇలా కక్ష సాధింపులకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ ఆరోపించారు.


