కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన క్యూట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి ట్రెండింగ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. “ఆరా ఆఫ్ ఉస్తాద్”(Aura Of Ustaad) అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ కల్ట్ ఫ్యాన్స్‌ని మెప్పించేలా ఈ సాంగ్ ఉండనుంది. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


