కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) వివాదం తర్వాత బంగ్లాదేశ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది (India – Bangladesh). భారత్‌తో ఉద్రిక్తతలను త్వరగా పరిష్కరించాలని కొత్త క్రీడామంత్రి అమీనుల్ హక్ (Aminul Haque) ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన భారత ఉప హైకమిషనర్‌ను పార్లమెంట్ భవనంలో కలిశారు. టీ20 ప్రపంచకప్ అంశంపై చర్చించినట్లు తెలిపారు. చర్చ సానుకూలంగా, స్నేహపూర్వకంగా సాగిందని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనకపోవడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, శ్రీలంకలో ఈ టోర్నీ హైబ్రీడ్ మోడ్‌లో జరుగుతోంది.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం లభించింది. గత ప్రభుత్వం భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా జట్టును భారత్‌కు పంపకూడదని నిర్ణయించింది. ఈ పరిణామాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తప్పించాలని భారత ప్రభుత్వం కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ప్రపంచ కప్‌లో ఆడకపోవడంపై బంగ్లాదేశ్ మీద ఎలాంటి జరిమానా ఉండదని ఐసీసీ ఫిబ్రవరి 9న స్పష్టం చేసింది. అలాగే 2031 పురుషుల వన్డే ప్రపంచకప్‌కు ముందు ఒక ప్రత్యేక ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్య హక్కులు కూడా బీసీబీకి మంజూరు చేయనున్నట్లు చెప్పింది.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్‌తో కలిసి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది (India – Bangladesh). ఈ క్రమంలో క్రీడలతో పాటు అన్ని రంగాల్లో భారత్‌తో నిజాయితీ, స్నేహపూర్వక సంబంధాలు నిర్మించాలని తమ ప్రభుత్వం ఆశిస్తున్నట్లు అమీనుల్ తెలిపారు. దౌత్య సమస్యలు ముందుగానే పరిష్కరించగలిగితే, జట్టు ప్రపంచకప్‌లో ఆడేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక టీమిండియా ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్ ఉంది. ఈ సిరీస్‌పై కూడా దృష్టి కేంద్రీకృతమైంది.
Read Also: ఉచిత పథకాలు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


