epaper
Sunday, February 22, 2026
epaper

క‌ర్రెగుట్ట‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఐదుగురు మావోయిస్టులు హ‌తం

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని క‌ర్రెగుట్ట (Karregutta)లో మ‌రోసారి తుపాకీల మోత మోగింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఇక్క‌డ భారీ ఎన్‌కౌంట‌ర్ (Encounter) నిర్వ‌హించాయి. ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్ర‌నేత‌లు కూడా ఉన్నార‌ని స‌మాచారం. ఆప‌రేష‌న్ 2 క‌గార్ (Operation 2 Kagar) పేరుతో కేంద్రరాష్ట్ర బ‌ల‌గాల‌ భారీ కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి. మావోయిస్ట్ అగ్ర నేత‌లే టార్గెట్‌గా ఆప‌రేష‌న్ 2 క‌గార్ చేప‌ట్టారు.

మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామ‌ని ఇంత‌కు ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంకా న‌ల‌బై రోజులే మిగిలి ఉన్నందున‌ ఆప‌రేష‌న్ క‌గార్ వేగ‌వంతం చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌తో క‌ర్రె గుట్ట‌లో (Karregutta Encounter) భారీ ఎత్తున కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు.

Read Also: వచ్చే ఎన్నికలే లక్ష్యం: కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>