epaper
Sunday, February 22, 2026
epaper

ఇలా కూడా రోడ్డు వేస్తారా..!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో గల మామిళ్ళగూడెం (Mamillagudem)లో విద్యుత్ స్తంభాలు (Electric Poles) తొలగించకుండా రోడ్డు వేయడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామిళ్ల గూడెం బైపాస్ రోడ్డు నుంచి రామాలయం రోడ్డు వరకూ ఇటీవల సీసీ రోడ్డు వేశారు. అయితే రోడ్డు మధ్య‌లో ఉన్న కరెంటు స్తంభాలను తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో అటు వైపు నుంచి వెళ్తున్న వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా మారింద‌ని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>