epaper
Sunday, February 22, 2026
epaper

భార‌త్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఆఫీసులు.. ఎక్క‌డంటే..?

క‌లం, వెబ్ డెస్క్‌: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న నేప‌థ్యంలో ఓపెన్ ఏఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓపెన్ ఏఐ ఫ‌ర్ ఇండియా కార్యక్రమం కింద ఈ ఏడాది బెంగుళూరు (Bengaluru), ముంబై (Mumbai)లో కొత్త కార్యాలయాలు ప్రారంభించనుంది. ఈ కార్యాలయాలు (OpenAI Offices) ఇప్పటికే ఉన్న ఢిల్లీ కార్యాలయంతో పాటు పని చేస్తాయి.

ఓపెన్ ఏఐ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని విద్యార్థులు, ఉద్యోగులు, కంపెనీలు ఏఐని సులభంగా ఉపయోగించేందుకు శిక్ష‌ణ అందిస్తారు. అలాగే దేశంలో ఏఐ వినియోగ‌ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ అల్ట్‌మాన్ (Sam Altman) మాట్లాడుతూ భార‌త్‌లో పెద్ద ఎత్తున‌ ఏఐ వినియోగిస్తున్నార‌ని తెలిపారు. దేశీయ టెక్ నైపుణ్యం, ఏఐపై న‌మ్మ‌కం, ప్రభుత్వ మద్దతు వల్ల భారత్ భవిష్యత్తులో ఏఐని సరిగ్గా ఉపయోగించడంలో కీలక పాత్ర పోషించగలద‌న్నారు. ప్రస్తుతం భారత్‌లో విద్యార్థులు, డెవలపర్లు, ఉపాధ్యాయులు, కంపెనీల్లో కోటికి పైగా చాట్ జీపీటీ యూజర్లు ఉన్నారని ఓపెన్ ఏఐ (OpenAI) వెల్ల‌డించింది.

Read Also: రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>