కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ సరైన సమయంలో పీక్ ఫామ్‌లోకి వచ్చిందని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) అన్నాడు. టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ జట్టు మూమెంటం పెరిగిందని చెప్పాడు. కొలంబోలో కఠినమైన పిచ్‌పై కూడా భారత్ మెరుగైన ప్రదర్శన ఇచ్చిందని పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో పాకిస్తాన్‌పై 61 పరుగుల విజయం సాధించిన భారత్ ఇప్పటికే సూపర్–8 దశకు చేరింది. అమెరికా, నమీబియాపై కూడా గెలిచింది. స్పిన్‌పై తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడ్డ జట్టు, మూడో మ్యాచ్‌లో స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొందని బంగర్ విశ్లేషించాడు.
కఠిన పరిస్థితుల్లో మంచి స్కోరు చేయడం జట్టు స్థిరత్వానికి సంకేతమని అన్నాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వేదికయిన అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, అక్కడ బ్యాటర్లు ఆనందంగా ఆడతారని చెప్పాడు. వరల్డ్‌కప్‌లో వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు కాంబినేషన్ ముఖ్యమని స్పష్టం చేశాడు (Sanjay Bangar). భారత్ 2022లో నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో గెలిచింది.


