epaper
Wednesday, February 18, 2026
epaper

అద్దంలాంటి రోడ్లకే ప్రాధాన్యం.. బడ్జెట్ ప్రపోజల్స్‌పై కోమటిరెడ్డి రివ్యూ

కలం, వెబ్ డెస్క్: రోడ్లు భవనాలు శాఖ వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) సమీక్ష నిర్వహించారు. గతేడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై మంత్రి చర్చించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేట్స్ సంబంధిత అధికారులకు సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ‘2047 రైసింగ్ తెలంగాణ’ నినాదంలో రాష్ట్ర రోడ్ నెట్వర్క్ అభివృద్ధి అత్యంత కీలకమని కోమటిరెడ్డి అన్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నామన్నారు. ఇప్పటికే బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

హైదరాబాద్-విజయవాడ (NH 65) 8లేన్ విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు కోమటిరెడ్డి (Minister Komatireddy) వెల్లడించారు. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కోరతానన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగకరమైన రోడ్డు అని, ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ (HYD – VJA) రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునన్నారు. కేంద్ర సహకారం అందించే ప్రాజెక్టుల్లో వేగం పెంచేందుకు కేంద్ర మంత్రులను కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Read Also: అడ్డు తొలగించుకోవడమే వాళ్ల విధానం: ఆర్​ఎస్​ఎస్​ చీఫ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>