Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందాపూర్ డెయిరీ తీర్మానం తిర‌స్క‌ర‌ణ‌.. మండ‌లిలో వైసీపీ ఆందోళ‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ శాస‌న‌మండ‌లి (AP Legislative Council)లో వైసీపీ స‌భ్యులు ఇందాపూర్ డెయిరీపై వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని మండ‌లి చైర్మ‌న్ తిర‌స్క‌రించారు. దీంతో వైసీపీ(YSRCP) స‌భ్యులు ఆందోళన‌కు దిగారు. దీనికి ముందు అసెంబ్లీ బయట వైసీపీ సభ్యుల నిరసన తెలిపారు. అసెంబ్లీ గేట్ నుంచి కౌన్సిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. తిరుమ‌ల ల‌డ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వంపై వైసీపీ ఘాటు విమర్శలు చేస్తున్న‌ది. ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంద‌ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఉద్రిక్త‌త‌ల న‌డుమ మండలి ఐదు నిమిషాల పాటు వాయిదా ప‌డి మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. మ‌రోవైపు మంత్రి నారా లోకేశ్ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్‌ చిట్‌చాట్‌గా మాట్లాడారు. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స పార్టీ నేతలపై పట్టు కోల్పోయార‌ని వ్యాఖ్యానించారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చార‌ని తెలిపారు. ఒకరు కల్తీ నెయ్యిపై చర్చ అడిగితే మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగార‌ని వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>