కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వెళ్తుండగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేసింది. దీంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని చివరి వాహనం డ్యామేజ్ అయ్యింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది నిమిషాల అనంతరం మళ్లీ కాన్వాయ్ ముందుకు కదిలింది. అయితే ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో పవన్ కల్యాణ్ లేరు. ఆయనను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


