epaper
Wednesday, February 18, 2026
epaper

అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌గాలి: సునేత్ర పవార్

క‌లం, వెబ్ డెస్క్‌: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్(Sunetra Pawar), ప‌లువురు ఎన్‌సీపీ (NCP) ముఖ్య‌ నేతలు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు. సునేత్ర పవార్‌తో పాటు సీనియర్ నేతలు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్, హసన్ ముష్రిఫ్, అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ కూడా ఫడ్నవీస్‌ను కలిసి దర్యాప్తు కోరుతూ లేఖ అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్వతంత్ర సంస్థల ద్వారా దర్యాప్తు ప్రారంభించింద‌న్నారు. అయినప్పటికీ, సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ అవసరం అని భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు తెలియజేస్తామని సీఎం హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు.

ప్రమాదానికి గురైన లియర్‌జెట్ 45 విమానంలోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ నుండి డేటాను డౌన్‌లోడ్ చేసిన‌ట్లు విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ వెల్లడించింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌పై సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయని, డేటా రికవరీ కోసం అమెరికా ప్రతినిధుల సహాయం కోరామని ఏఏఐబీ వెల్ల‌డించింది. ఈ విమానం తయారీ దేశం అమెరికా కావడం వల్ల అక్కడి నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ అస‌త్య ప్ర‌చారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>