వారణాసి : ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్లు ?

కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి” (Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాణంలో ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం తాను ఈ సినిమాలో మహా శివ భక్తునిగా నటిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి వారణాసి సినిమాను భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని త్రేతాయుగం రామాయణం ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కానుంది. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కే ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ రామాయణ ఎపిసోడ్ షూట్ చేసి VFX వర్క్ కోసం పంపినట్లు రాజమౌళి తెలిపారు. రామాయణ ఎపిసోడ్ చూశాక ఫ్యాన్స్ కి గూస్ బుంప్స్ గ్యారెంటీ అని రాజమౌళి హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>