epaper
Wednesday, February 18, 2026
epaper

మెదక్ కలెక్టర్ కు జైలు శిక్ష.. హైకోర్టు తీర్పు

కలం, డెస్క్ : మెదక్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ (Medak Collector) రాహుల్ రాజ్ కు జైలు శిక్ష వేసింది హైకోర్టు. గతంలో ఓ భూమి విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని హైకోర్టు కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. కలెక్టర్ (Medak Collector) అప్పీలు చేసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. గతంలో ఓ భూ వివాదం కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును కలెక్టర్ లెక్కచేయకుండా వ్యవహరించారని ఆరోపిస్తూ బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మీ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీనిపై కలెక్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>