epaper
Wednesday, February 18, 2026
epaper

సినీ ఫక్కీలో ఎనిమిది లక్షలు మాయం

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడలొ సినీ ఫక్కీ లో చోరి జరిగింది. బిచ్కుంద మండలం హాజ్గుల్ గ్రామానికి చెందిన మాధవ రావు అనే వ్యక్తి బాన్సువాడ (Banswada) ఎస్బిఐ బ్యాంక్ నుండి 8 లక్షలు డ్రా చేసి కారు వద్దకు వచ్చి కారులో డబ్బులు పెట్టాడు. సూపర్ మార్కెట్‌లోకి షాపింగ్ కోసం వెళ్ళాడు. బయటకు వచ్చి చూసేసరికి ఘోరం జరిగిపోయింది. బ్యాంక్ నుండి రెక్కీ నిర్వహించి టెక్నిక్‌తో కారు గ్లాసులు పగుల గొట్టి 8 లక్షల డబ్బులను దొంగలు ఎత్తుకెళ్లారు.

కారు విండో గ్లాసులు పగిలి ఉండటం చూసి లోపల డబ్బులు లేకపోవడంతో మాధవ రావు షాక్‌కు గురయ్యాడు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ విఠల్ రెడీ, సిఐ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. దొంగలు కారు వద్దకు వచ్చి కారు గ్లాస్‌లు తొలగించి డబ్బులు తీసుకెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కార్లలో డబ్బులు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>