epaper
Wednesday, February 18, 2026
epaper

అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పిన కావేరీ

కలం, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పై బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బారువా(Kaveri Baruah) చేసిన కామెంట్స్ ఎంతటి వివాదానికి దారితీసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్‌ని కలవాలంటే ’42 రూల్స్ పాటించాలి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కావేరీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అల్లు అర్జున్ టీం ఓ వెబ్ నోట్ రిలీజ్ చేసి.. కావేరీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపింది. దీనితో తాజాగా బన్నీపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు కావేరీ తెలిపింది.

అంతే కాకుండా అల్లు అర్జున్‌ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఇటీవల నా పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్‌కి సంబంధించి చెప్పిన విషయాలు వెనక్కి తీసుకుంటున్నాను. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా అలా మాట్లాడడం సరికాదు.. నా మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నా వ్యాఖ్యల వల్ల సదరు హీరో ప్రతిష్టకు భంగం కలిగినట్లు తెలిసింది. ఆయనకు నా సీరియస్ అపాలజీ తెలియజేస్తున్నాను అంటూ కావేరీ (Kaveri Baruah) ఓ నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Read Also: నాని “ది ప్యారడైజ్” మూవీ బిగ్ అప్డేట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>