Mobile Popup Ad
Mobile Popup Ad

మణికొండలో కుంగిన రోడ్డు..

కలం, డెస్క్ : మణికొండలో (Manikonda) నిన్న రాత్రి మంజీరా పైపులైన్ పగిలిన సంగతి తెలిసిందే కదా. ఆంధ్రాబ్యాంకు సర్కిల్ దగ్గర పైప్ పగిలి పోవడంతో.. రాత్రి నుంచి నీరు పొంగిపొర్లుతున్నాయి. నీటి ధాటికి తాజాగా రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా పైపు లైన్ పక్కనే డ్రైనేజీ లైన్ ఉంది. దీంతో మంజీరా పైపు లైన్ లోకి డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే మంజీరా నీళ్లు పెద్ద ఎత్తున రావడంతో కొన్ని అపార్టుమెంట్లు, కాలనీలు నీట మునిగాయి. ఇంకోవైపు అధికారులు మరమ్మతు పనులు చేస్తున్నారు.

Read Also: రోడ్డునపడ్డ 200 మంది చిరు వ్యాపారుల కుటుంబాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>