epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రాణాలు తీస్తున్న ప్రధాన రహదారి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం – చర్ల (Bhadrachalam Charla Highway) ప్రధాన రహదారి గుంతలతో ధ్వంసం అయి ఇప్పటికే ఎన్నో ప్రాణాలను బలిగొనింది. వారం క్రితం కూడా చర్ల మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గుంతల రోడ్ల కారణంగా బైక్ వెనుక సీటు నుంచి జారీ కిందపడడం, అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సిమెంట్ లోడు లారీ ఆమె పైనుంచి దూసుకెళ్లడం, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడవడం, క్షణాల్లో జరిగి పోయింది. ఇలా స్థానికంగా ఉండే ఎంతో మందిని ఈ రోడ్డు పొట్టన పెట్టుకుందని బాధితులకు సంబంధించిన బంధువులు వాపోతున్నారు.

ధ్వంసమైన ప్రధాన రహదారినీ వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ దుమ్ముగూడెం మండలం మూలకపాడు వద్ద గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు భద్రాచలం – చర్ల (Bhadrachalam Charla) రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, వెంటేనే రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు. అప్పటి వరకూ ఈ రోడ్డు మీద ఇసుక లారీలను అనుమతించకూడదని వారు డిమాండ్ చేయడంతో పాటు, రోడ్డు పురుద్ధరణపై ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also: కొలువుదీరిన బంగ్లాదేశ్​ ప్రభుత్వం.. మంత్రిగా హిందూ ఎంపీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>