epaper
Wednesday, February 18, 2026
epaper

రోడ్లు క్లీన్‌గా లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తా : సీఎం రేవంత్

కలం, డెస్క్ : రోడ్లు పరిశుభ్రంగా లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. సచివాలయంలో పురపాలక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తా. రోడ్లు సరిగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటా. ఇక నుంచి కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయాన్నే ఫీల్డ్ లో ఉండాలి. మూడు కార్పొరేషన్లలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. నగరంలో స్మార్ట్ స్కై వాక్ లను ఏర్పాటు చేయాలి. నెక్లెస్ రోడ్ దగ్గర మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

అడ్వర్టయిజింగ్ బోర్డులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 అడ్వర్టయిజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వర్టయిజింగ్ బోర్డుల నుంచి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వర్టయిజింగ్ బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలి’ అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Read Also: నల్లగొండలో 54 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు.. ఎందుకోసమంటే !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>