epaper
Wednesday, February 18, 2026
epaper

‘న్యూస్​క్లిక్​’పై ఈడీ కొరడా.. రూ.184కోట్ల జరిమానా

కలం, వెబ్​డెస్క్​: ఆన్​లైన్​ వార్తల పోర్టల్​ ‘న్యూస్​క్లిక్​’పై (NewsClick) ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కొరడా ఝలిపించింది. విదేశీ మారకద్రవ్య చట్టం నిర్వహణ(ఫెమా) కింద న్యూస్​క్లిక్​తోపాటు దాని వ్యవస్థాపకుడు, ఎడిటర్​ ఇన్​ ఛీప్​ ప్రబిర్​ పుర్కాయస్థకు రూ.184కోట్ల పెనాల్టీ నోటీస్​ జారీ చేసింది. ఇందులో న్యూస్​క్లిక్​కు రూ.120 కోట్లు, పుర్కాయస్థకు రూ.64కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఈడీ సోమవారం నోటీసులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) నిధులు, సేవలు, ఎగుమతుల ప్రకటనల్లో అవకతవకలకు పాల్పడి ఫెమా నిబంధనలు అతిక్రమించినట్లు న్యూస్​క్లిక్​పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, తప్పుడు ప్రచారంతో దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం, ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించడం లక్ష్యంగా న్యూస్​క్లిక్​కు నిధులు అందినట్లు ఈడీ ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు.

2019 లోక్​సభ ఎన్నికలను ప్రభావితం చేయాలనే కుట్రలో భాగంగా పీపుల్స్​ అలయెన్స్​ ఫర్​ డెమొక్రసీ అండ్ సెక్యులరిజం సంస్థతో కలసి పనిచేశారనే ఆరోపణలూ పుర్కాయస్థ(Prabir Purkayastha) మీద ఉన్నాయి. చైనా అనుకూల ప్రచారం కోసం విదేశాల నుంచి నిధులు స్వీకరించారనే కేసులో 2023 అక్టోబర్​ 3న పుర్కాయస్థను అరెస్ట్​ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసులో న్యూస్‌క్లిక్ (NewsClick) హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఉగ్రవాద వ్యతిరేక చట్టం‌‌ – ఉపా కింద అరెస్టు చేశారు. పలువురు జర్నలిస్టులను విచారించారు.

Read Also: మానవ సంక్షేమం కోసం ఏఐ ఉపయోగపడాలి : ప్రధాని మోదీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>