కలం, సినిమా : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్ర అయిన అవలీలగా నటించే అద్భుత నటుడు. దాదాపు తన సినీ కెరీర్ లో 300కు పైగా చిత్రాలలో నటించిన ప్రకాష్ రాజ్.. తాజాగా తాను చేస్తున్న సరికొత్త పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
తాను హిందీ ‘దృశ్యం3′(Drishyam 3) లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి”(Varanasi) సినిమాలో సైతం తాను నటిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వారణాసిలో తాను మహా శివుని భక్తునిగా నటిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


