కలం, వెబ్ డెస్క్: తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) ఎట్టకేలకు దిగొచ్చారు. నటి త్రిష (Actress Trisha), టీవీకే అధినేత విజయ్ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. త్రిషకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. త్రిషకు, విజయ్‌కు సంబంధం ఉందన్నట్టుగా నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. దీంతో త్రిష ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీ అభిమానులు, విజయ్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి త్రిషపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు కూడా ఖండించారు. ఈ నేపథ్యంలో త్రిష న్యాయపరమైన చర్యలకు దిగుతూ నాగేంద్రన్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, వెంటనే వాటిని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
లీగల్ నోటీసులు అందుకున్న అనంతరం నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ వ్యక్తిగతంగా బాధించాలనే ఉద్దేశంతో చేయలేదని తెలిపారు. అయినప్పటికీ తన మాటల వల్ల త్రిష మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణలు కోరుతున్నానని వెల్లడించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read Also: విజయ్, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో ఎక్కడంటే?
Follow Us On : WhatsApp


