కలం, డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ కు గాయాలు అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఫౌజీ (Fauzi) మూవీ సెట్స్ లో ప్రభాస్ గుర్రపు స్వారీ చేస్తుండగా కిండ పడ్డాడని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చేతికి చిన్న గాయం అయిందని.. వెంటనే ట్రీట్ మెంట్ ఇచ్చారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.
దీంతో ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. ప్రభాస్ (Prabhas) కు ఏమైందో తెలపాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ప్రభాస్ కు తగిలింది పెద్ద గాయాలు కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చేతికి చిన్న గాయం అయితే వెంటనే ట్రీట్ మెంట్ ఇచ్చారని.. ప్రభాస్ కు ఎలాంటి ప్రమాదం లేదని ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.
Read Also: విజయ్, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో ఎక్కడంటే?
Follow Us On: Sharechat


