కలం, వెబ్ డెస్క్: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని (Wanaparthy Municipality) కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు చైర్మన్ పదవి ఇస్తామని నమ్మించి మోసారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చినప్పుడే తనకు చైర్ పర్సన్‌గా అవకాశం ఇస్తామని చీర్ల రజిని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చినప్పుడే చైర్‌పర్సన్ అవకాశం గురించి పార్టీ నేతలతో చర్చించామని చెప్పారు.
చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. చివరి నిమిషంలో పార్టీ నేతలు తిరకాసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మాది మూడు తరాలుగా కాంగ్రెస్ కుటుంబం. మా నమ్మకాన్ని పార్టీ వమ్ముచేసింది. అందుకే పార్టీకి పదవికి రాజీనామా చేశాం’ అంటూ రజిని పేర్కొన్నారు. వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో (Wanaparthy Municipal Elections) రజిని చందర్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం.
Read Also: బీజేపీ నేత వ్యాఖ్యలపై నటి త్రిష రియాక్షన్
Follow Us On : WhatsApp


